Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీ స్థానాలపై జనసేన కన్ను..అదే ఆలస్యానికి కారణం!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తు కుదిరినా ఇంకా ఫస్ట్ లిస్ట్ ప్రకటనపై సందిగ్దం కొనసాగుతూనే ఉంది. జనసేనకు 25 అసెంబ్లీ , 3 ఎంపీ స్థానాలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న దీనిపై అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన మాత్రం రావడం లేదు. ఎందుకంటే జనసేన కొరుతున్న స్థానాల్లో టీడీపీ బలంగా ఉన్న సీట్లే ఎక్కువే. ఇదే పొత్తు ప్రతిష్టంభనకు కారణమని తెలుస్తోంది.

పొత్తు ధర్మం పాటించాలాని పైకి ఇరు పార్టీల నేతలు చెబుతున్న లోలోపల మాత్రం అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. కొన్ని సీట్లపై రెండు పార్టీలు పట్టుబడుతుండటం అసలు సమస్యకు కారణమవుతోంది. అందుకే ఇంతవరకు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఎవరికి ఏ సీటు కేటాయిస్తారన్న విషయంపై నేతలు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.

టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకం విషయంలో పోరు కొనసాగుతుండగానే బీజేపీ ఎంటరవడం మరింత ఆలస్యానికి దారితీస్తోంది. ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లను ఆశీస్తోంది జనసేన. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశీస్తుండగా అడిగిన సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్దంగా లేదు. అందుకే టీడీపీ లిస్ట్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా నాన్చుడు ధోరణి మంచిది కాదని నేతలు వాపోతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -