Friday, May 10, 2024
- Advertisement -

యంగ్ హీరో తో ప్రేమలో ఉన్న అంజలి!

- Advertisement -

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది అంజలి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే అంజలి కోలీవుడ్ యంగ్ హీరో తో ప్రేమలో ఉన్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అంతే కాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.

అయితే ముందుగా టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకున్న అంజలి.. తమిళ డబ్బింగ్ చిత్రం జర్నీతో తెలుగులోకి పరిచయం అయింది. తాజాగా ఈ సినిమాలో ఓ హీరోగా నటించిన జై తో అంజలి ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటివలే పుట్టినరోజు జరుపుకున్న అంజలికి సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చడట జై.

ఈ పార్టీ సందర్భంగా అంజలికి జై ప్రపోజ్ కూడా చేశాడని టాక్. దీంతో వీళ్ల మధ్య ప్రేమ ముదిరినట్టే అంటున్నారు. అంతేకాదు త్వరలో ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. మరి ఈ విషయంపై అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -