ఆమె ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అగ్ర హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో కూడా నటించింది. బాల నటిగా నటనలో అడిగు పెట్టి ఆమె హీరోయిన్ గా కూడా చాలా ఏళ్లు పాటు కొనసాగింది. హీరోయిన్ గా చాన్సులు తగ్గుతున్న టైంలో ఆమె కొన్ని సినిమాలో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.
ఆ తర్వాత సడేన్ గా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్ళి చేసుకుని లైఫ్ లో స్థిరపడింది. కెరీర్లో మంచి స్వింగులో ఉన్న టైంలో సంపాదించిన డబ్బులతో పెద్ద ఇల్లు కొనుగోలు చేసిందామె. ఐతే ఇప్పుడు ఆమె ఆ ఇంటిని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు సమాచారం. తన పెద్ద ఇంటిని అమ్మేసి.. ఇప్పుడు చిన్న ఇంట్లోకి వచ్చేసిందట. ఇదంతా తన ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త మూవీ కోసమేనట. ఇంటితో పాటు మరికొన్ని ప్రాపర్టీస్ ను కూడా అమ్మేసిందట.
సినిమాల నుంచి దూరమయ్యాక ఈ నటి ఓ ప్రి స్కూల్ నడపగా.. అది ఆమెకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దాంతో ఆమె ఇంతకముందు తన భర్త కోసం కూడా ఓ సినిమా నిర్మించింది. అది కూడా అమెకు నష్టం మిగిల్చింది. ఇప్పుడు తన ప్రొడక్షన్లో రాబోతున్న సినిమా మీదే అమె ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. ఆమె నటిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఒకట్రెండు సినిమాల్లో నటించింది. ఇప్పుడామె నటించిన ఓ హార్రర్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంకో రెండు మూడు చాన్సులు ఆమె చేతిలో ఉన్నాయి.
{youtube}qLpx-rQC62w{/youtube}
Related