Wednesday, May 22, 2024
- Advertisement -

హాయ్ నాన్న…అదిరే అప్‌డేట్!

- Advertisement -

దసరా తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. ఫ్యామిలీ ఒరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 7న పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా పట్ల మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంటే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ఈ పాన్ ఇండియా మూవీలో బేబీ కియారా ఖన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సినిమాటోగ్రాఫర్‌గా సాను జాన్ వరుగీస్ ఐఎస్‌సి, ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ చెరిగిపోని ఎమోషనల్ డ్రామాగా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవనుంది మేకర్స్ భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -