భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇక ఈ మ్యాచ్ ద్వారా సెమీస్ గండాన్ని అధిగమించిన భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఇవాళ దక్షిణాఫ్రికా – ఆసీస్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టుతో భారత్ తలపడనుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే.
ఇక భారత్ – కివీస్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌తో రికార్డులన్ని బ్రేక్ అయ్యాయి. కోట్లాది మంది ప్రజలు టీవీలు ,మొబైల్స్‌కు అతుక్కుపోయి మరి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనేకమంది సినీ తారలు కూడా వచ్చారు. దీంతో ఓటీటీ రికార్డులు అన్ని చెరిగిపోయాయి.
ఓటిటి చరిత్రలోనే హాట్ స్టార్ హైయెస్ట్ వ్యూస్ ని అందుకుంది. హాట్ స్టార్ ఏకంగా 53 మిలియన్ వ్యూస్ ని రిజిస్టర్ చేసింది. దీంతో పాత రికార్డ్స్ అన్నీ గల్లంతయ్యి సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది. సెమీ ఫైనల్లోనే రికార్డులు బ్రేక్ కాగా ఫైనల్ మ్యాచ్ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో వేచిచూడాలి.
