Monday, May 13, 2024
- Advertisement -

సహజీవనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హాట్ హీరోయిన్!

- Advertisement -

కంగనా రనౌత్.. తెరపై ముద్దుల విషయంలో తన ప్రత్యేక ముద్రను కలిగి ఉన్న హీరోయిన్.

ఒక సినిమాలో కాదు.. చాలా సినిమాల్లో కంగనా హాట్ కిస్సులతో థియేటర్లను హీటెక్కించ్చింది. ఇదే సమయంలో నాణ్యమైన నటనకు కూడా కంగనా పెట్టింది పేరు. ఇప్పటికే జాతీయ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకొంది. మరి తెరపై హాట్ హాట్ గా కనిపించడానికి వెనుకాడని ఈ హీరోయిన్ నిజ జీవితంలో మాత్రం చాలా కూల్ గా కనిపిస్తోంది.

ప్రత్యేకించి ఆమె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం.

జీవితంలో అభద్రతాభావంతో భయపడే వాళ్లే సహజీవనాన్ని కోరుకొంటారని.. కంగనా అంటోంది. తమ పై తమకు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్లు… వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు… లివిన్ రిలేషన్ షిప్స్ ను ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించరు అని.. కంగనా స్పష్టం చేసింది. నిజంగా చెప్పాలంటే కంగనా మాటలు ఆశ్చర్యపరిచేవే.. తెరపై హాట్ గా.. అన్నింటికీ సిద్దం అన్నట్టుగా కనిపించే హీరోయిన్ ఇలా మాట్లాడటం విశేషమే కదా. ఇదంతా చూస్తుంటే.. కంగనా అచ్చమైన భారతీయ సంస్కృతికి నిదర్శనంలా కనిపిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -