Sunday, April 28, 2024
- Advertisement -

గేమ్ ఛేంజర్..అదిరే రేటుకి?

- Advertisement -

శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుండగా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది గేమ్ ఛేంజర్.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌లో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ కానుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అన్ని భాషల్లో కలిపి గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ని రూ.110 కోట్లకు కొన్నారని టాక్ నడుస్తోంది. డిజిటల్ రైట్స్‌కే ఇంత భారీ రేటు అంటే ఇది ఒక రకంగా రికార్డే.

మొత్తం బడ్జెట్‌లో ఇది సగం అమౌంట్. రిలీజ్ కాకముందే డిజిటల్ రైట్స్ రూపంలో వచ్చాయంటే దిల్ రాజుకు కథపై ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతోందని అంతా చెబుతున్నారు. ఓ IAS ఆఫీసర్ కి, అవినీతి రాజకీయనాయకులకు మధ్య జరిగే కథే గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -