Friday, May 3, 2024
- Advertisement -

గుంటూరు కారం…భారీ డిమాండ్!

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

తొలుత ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావించారు. కానీ తర్వాత మహేష్ సూచనతో రీజనల్‌గానే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని భాషల నుండి డిమాండ్ రావడంతో మళ్లీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాను ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తారా లేదా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తారో లేదా అన్నది తెలియాల్సి ఉంది.

గుంటూరు నగరంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు పనిచేస్తున్న లేడీ జర్నలిస్టుతో ఆ నగరంలో గుంటూరు కారం అంతటి ఘాటైన యువకుడు ఆమె ప్రేమలో పడడం, అనంతరం విలన్స్ కి ఎదురుతిరగడం అనే కథాంశంతో ఈ మూవీ సాగుతుందట. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా మంచి హిట్ కావడంతో ఇప్పుడు వస్తున్న గుంటూరు కారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -