Monday, May 20, 2024
- Advertisement -

బాబుతో భేటీ తర్వాత పవన్‌ క్లారిటీ..తెరపైకి కొత్త నియోజకవర్గం!

- Advertisement -

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఇటలీ నుండి ఏపీకి తిరిగొచ్చిన పవన్ నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు తాను పోటీ చేసే స్ధానంపై పవన్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పవన్ భీమవరం లేదా గాజువాక లేక రాయలసీమలో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు పవన్ పోటీ చేసే స్థానంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో భీమవరంలో 8,357 ఓట్ల తేడాతో, గాజువాకలో 14,520 ఓట్ల తేడాతో ఓడిపోయారు పవన్. అయితే అప్పుడు ఒంటరిగా బరిలోకి దిగారు. కానీ ఇప్పుడు టీడీపీ మద్దతిస్తుండటంతో పవన్ పోటీ చేసే రెండు స్థానాల్లో ఒకటి భీమవరం అని తెలుస్తోంది. అలాగే రెండో స్ధానం రాయలసీమ నుండి కాకుండగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, మండపేట పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. భీమవరంలో సర్వే ఫలితాలు పవన్‌కు అనుకూలంగా ఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకోగా రెండో స్ధానంపై మాత్రం తర్జన భర్జన పడుతున్నారు పవన్.

ఇక ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉండగా సెప్టెంబర్ 28న మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆలోపే టీడీపీ – జనసేన మధ్య పొత్తు, సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టోని ఖరారు చేయాల్సి ఉండగా ఆ పనిలో బిజీగా ఉన్నారు ఇరు పార్టీల నేతలు. త్వరలోనే వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పవన్‌ పోటీ చేసే స్థానాలు కూడా ఫైనల్ కావడంతో త్వరలోనే అఫిషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -