Sunday, May 11, 2025
- Advertisement -

నా భార్య మీద నాకు నమ్మకం ఉంది – శ్రీను వైట్ల

- Advertisement -

శ్రీను వైట్ల పర్సనల్ లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ చాలా డీలా లో పడ్డాయి. సరిగ్గా బ్రూస్ లీ సినిమా దారుణ పరాజయం పొందిన వెంటనే ఆయన మీద పడిపోయారు జనాలు. శ్రీను పని అయిపొయింది అని విషయం లేకనే అంతటి ప్లాప్ సినిమా తీసాడు అంటూ ఆడిపోసుకున్నారు అదే సమయంలో సినిమాకి పనిచేసిన కోనా లాంటి వారు కూడా సినిమా ప్లాప్ కారణం శ్రీను మీదకి నెట్టేశారు .

ఇవన్నీ చాలవు అన్నట్టు శ్రీను కి ఇంట్లో గొడవలు రోడ్డున పడ్డాయి. స్వయంగా అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే అతనిమీద టార్చర్ పెడుతున్నాడు అంటూ రోడ్డుకి ఎక్కేసింది. భార్యతో వచ్చిన మనస్పర్ధల వలన శ్రీను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఈ విషయం మీద ఆసక్తికర విషయాలు రివీల్ చేసాడు ఆయన. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన దీని విషయంలో మాట్లాడారు.

తెలుగులో సినిమాలు ఫ్లాపైనా బాలీవుడ్ లో రీమేకైన రెడీ పెద్ద విజయం సాధించింది. తర్వాత బాలీవుడ్ ఛాన్సులొచ్చాయి.అక్కడ వీలుంటే సల్మాన్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నా. అందుకు ఛాన్సుంది ఇంకా… అని చెప్పాడు.  అలాగే ఫ్యామిలీ పరంగా అన్ని ఇబ్బందులు సర్ధుకున్నాయ్. నా భార్యకు నాపై పూర్తి నమ్మకం ఉంది. మాది ప్రేమ వివాహం.

పెళ్లికి ముందే ఏడాది పాటు ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం. మొదటగా నేనే ప్రపోజ్ చేశాను. తను అంగీకరించినా వాళ్లింట్లో వాళ్లు ఆలోచించారు. అయితే చివరికి అందరూ సెట్టయ్యారు. అలా మేం పెళ్లి చేసుకున్నాం.. అని చెప్పాడు. ఇంతకీ తాను అలా ఎందుకు చేసింది అనీ, కేసు ఎందుకు పెట్టలేదు అనీ మాత్రం  చెప్పలేదు శ్రీను .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -