Monday, May 5, 2025
- Advertisement -

నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల

- Advertisement -
i love prabhas says gutta jwala

బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ‘ఐ లవ్ వ్యూ’ చేప్పేసింది గుత్తా జ్వాల. యంగ్ హీరో నితిన్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన గుత్తా జ్వాల.. ఓ పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెబుతూ, ఆయన హైట్ అంటే ఇంకా ఇష్టమని, ‘ఐ లవ్ హిమ్’ అని చెప్పింది. హిందీతో పాటు తెలుగు సినిమాలను బాగా చూస్తానని.. ప్రభాస్ ను రెండు సార్లు కలిశానని చెప్పింది.

ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని చెప్పింది. నితిన్ తో స్నేహం గురించైతే చెప్పే అవసరం లేదని.. సినిమాల్లో నటిస్తాను అని ఒక్క మాట చెప్పగానే ఓ ఆఫర్ తీసుకుని వచ్చేశాడని చెప్పింది. భార్యభర్తలిద్దరిలో ఏ ఒక్కరికి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదని, తన మొదటి భర్త చేతన్ విషయంలో ఇలా జరగనందుకే విడిపోయామని… కానీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ‘కానీ నాకు కావాల్సిన మనిషి ఇంకా దొరకలేదు. అతడు టాల్ గా కూడా ఉండాలి’ అని చెప్పింది.

ఇంకా.. తాను టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఏం మాట్లాడినా ఎందుకు కాంట్రవర్సీ అవుతాయో అర్థం కావడం లేదని.. ‘మా హక్కుల గురించే మేం మాట్లాడాం’ అని చెప్పింది. తనలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు ఉన్న ఏ రాజకీయ వేత్తలైనా తనకు ఛాన్స్ ఇస్తే పాలిటిక్స్ లోకి వస్తానని.. మహిళలు, చిన్నపిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించింది.

Related

  1. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  2. వామ్మో ఆకాశంలో 30 కోట్లు ఎగరేసిన ప్రభాస్‌!
  3. అమ్మాయిలను బాధపెడుతున్న ప్రభాస్!
  4. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -