Saturday, April 27, 2024
- Advertisement -

దూత 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

- Advertisement -

నాగ చైతన్య కెరీర్‌లో తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. దూత అనే వెబ్ సిరీస్‌తో రాగా ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆట్టుకుంది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ హార్ థ్రిల్లర్‌ అందరిని ఇంప్రెస్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఈ సిరీస్ రికార్డు వ్యూస్ రాబట్టింది. ఇక ఎప్పుడెప్పుడు దూత 2 వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కీ అప్‌డేట్ ఇచ్చేశారు చైతూ.

దూత టీం తో కలిసి త్వరలో వస్తున్నానని..ఇది అందరికి నచ్చుతుందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. చైతూతో పాటు ప్రాచి దేశాయ్, ప్రియా భవాని శంకర్ తదితరులు నటించగా శరత్ మరార్ నిర్మాణం వహించారు.

ప్రస్తుతం చందూ మొండేటితో సినిమా చేస్తున్నారు చైతూ. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా ఈ చిత్రానికి తండేల్ అనే టైటిల్ ఖరారు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -