Sunday, April 28, 2024
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఎంపీ సీట్ల ఎంపికలో మెజార్టీ సీట్లలో ఏకాభిప్రాయానికి రాగా రెండు,మూడు సీట్లలో మాత్రం పీటమూడి వీడటం లేదు. ప్రధానంగా నాగర్‌కర్నూల్, ఖమ్మం సీట్లలో వివాదం పెద్దదయ్యే అవకాశం కనిపిస్తోంది.

నాగర్‌ కర్నూల్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక టికెట్ మల్లు రవికే కన్ఫామ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంపత్ కుమార్ లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన సంపత్‌…మల్లు రవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకే కేటాయించాలని ..ఖమ్మం నేతలు, కొందరు ఏఐసీసీ పెద్దలు కలిసి తప్పుడు నివేదిక అందించారని ఆరోపించారు.

మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి గతంలో నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారని..వలస వచ్చిన నేత అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం సీటు భట్టి వర్సెస్ పొంగులేటిగా మారింది. భట్టి తన సతీమణి నందినీని బరిలోకి దించాలనుకుంటుండగా పొంగులేటి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా సీనియర్ నేతల మధ్య పోరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మరి ఈ రెండు సీట్లలో అదృష్టం ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -