Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్నికల ఎఫెక్ట్…కల్కి వాయిదానే?

- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15 కల్కి రిలీజ్‌కు కొత్త డేట్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆగస్టు 15న సుకుమార్ – బన్నీ పుష్ప 2 రిలీజ్ ఉండనుండగా బాలీవుడ్ సినిమా సింగం ఎగైన్,కన్నడలో శివరాజ్‌కుమార్ భైరతి రంగల్‌ రిలీజ్ అవుతున్నాయి. కల్కి, పుష్ప 2 రెండు పాన్ ఇండియా చిత్రాలే కావడంతో బాక్సాఫీస్ వద్ద వార్ ఆసక్తికరంగా ఉండనుందని టాక్ నడుస్తోంది.

అయితే కల్కి వాయిదాపై మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ వాయిదా పడితే ఆగస్టు 15న రిలీజ్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక వైజయంతీ మూవీస్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ఇండస్ట్రీ ప్రముఖులు కల్కిలో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -