Sunday, April 28, 2024
- Advertisement -

పవన్‌..అధ్యక్షా అని అనేనా?

- Advertisement -

ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది జనసేన అధినేత పవన్ సంకల్పం. గత ఎన్నికల్లో రెండు చోట్ల గాజువాక, భీమవరం ఓడిపోయారు. దీంతో సారి ఎలాగైన ఎమ్మెల్యేగా గెలవాలని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే పవన్‌ పోటీ చేసే స్థానంపై కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తుండగా ఆయనే స్వయంగా పీఠాపురం అని ప్రకటించారు.

వివిధ సర్వే ఫలితాలు, గెలుపు అంచనాల నేపథ్యం, కాపు ఓట్లపై నమ్మకంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్. దీంతో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ప్రత్యర్థి వైసీపీ నుండి పోటీ చేస్తున్న వంగ గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆమెది కాపు సామాజికవర్గమే.

పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 91 వేలుండగా ఎవరు గెలవాలన్న వీరి ఓట్లే కీలకం. అందుకే వంగ గీతను బరిలోకి దింపారు సీఎం జగన్. దీనికి తోడు కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఇది కూడా గీతకు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇదిఇలా ఉంటే పిఠాపురంలో కూటమి నేతలు పవన్‌కు సపోర్ట్ చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే సీటు తమకే వస్తుందని తెలుగుదేశం నేత సత్యానారాయణ మొదటి నుండి పనిచేసుకుంటూ వస్తున్నారు. తీరా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. చంద్రబాబుతో చర్చలు జరిపిన తర్వాత కాస్త మెత్తబడ్డ పవన్‌కు ఏ మాత్రం సహకరిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి గెలుపు వ్యూహాలు రచిస్తారు అన్నది ఉత్కంఠగా మారగా పీఠాపురం ప్రజలు ఎమ్మెల్యేగా గెలవాలన్న పవన్ కోరికను నేరవేరుస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -