Sunday, April 28, 2024
- Advertisement -

లండన్‌లో ప్రభాస్ ఇళ్లు!

- Advertisement -

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా అయినా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. ఒకే ఒక్క సినిమా బాహుబలితో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోగా అందుకు తగ్గట్టే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ప్రభాస్.

ఇక ఈ ఏడాది మరో అడ్వెంచర్ మూవీ కల్కితో ప్రేక్షకుల ముందుకురానుండగా దీంతో పాటు పలు సినిమాలు లైన్‌లో పెట్టేశాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, సందీప్ వంగా,హను రాఘవపూడితో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఇక ఇటీవల ప్రభాస్‌ కాలుకు సర్జరీ జరుగగా దీంతో పాటు ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. లండన్ లో ఒక విలాసవంతమైన ఇంటిని అద్దెకి తీసుకున్నాడట. ఈ ఇంటికోసం ప్రభాస్ నెలకు కడుతున్న అద్దె అక్షరాల రూ.60 లక్షలని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కల్కి టీజర్‌ని త్వరలోనే విడుదల చేయనుండగా ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -