Monday, April 29, 2024
- Advertisement -

ఈ 10 టిప్స్ పాటిస్తే..మీ ఆరోగ్యం పదిలం

- Advertisement -

మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ హెల్తి లైఫ్ స్టైల్‌కు అలవాటు పడుతున్నారు. అయితే ఈ 10 ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చు.

()రోజువారీ లేదా వారానికోసారి మీ శరీర బరువును ట్రాక్ చేయడం వల్ల శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. బరువు పెరిగితే దానిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేదానిపై క్లారిటి వస్తుంది.

()ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా ఉదయమే అల్పాహారం తినడం కంపల్సరీ. అలాగే తీసుకునే ఆహారంలో ఎక్కువ ప్రొటీన్లు, ఫైబర్,తక్కువ కొవ్వు, చక్కెర తక్కువగా ఉండే ఆహార్ని తీసుకోవడం మంచిది.

() తగినంత పోషకాలు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, రోజువారీ మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం మంచిది. ప్రత్యేకంగా ఇంట్లో వివిధ రకాల కూరగాయలు ,పండ్లు లేనప్పుడు విటమిన్ ట్యాబ్లెట్లు మంచి హెల్ప్ చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి.

()ఆరోగ్యంగా ఉండటంలో ప్రధానంగా దోహదం చేసేంది నీరు. క్రమం తగ్గకుండా నీరు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

()క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది శారీరకంగా చురుకుగా ఉండటంలో సహాయ పడుతుంది.

()ఎక్కువ సేపు కూర్చోవడం, అదే పనిగా టీవీ చూడటాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గంటకు ఓసారి రిలాక్స్ గా నడవడం మంచిది.

()తగినంత నిద్ర మనం ఆరోగ్యవంతంగా ఉండటానికి ప్రధానంగా దోహదం చేస్తుంది. ప్రతిరోజు ఎనమిది గంటల నిద్ర కంపల్సరీ. దీనివల్ల రోగ నిరోధక వ్యక్తంగా సక్రమంగా పనిచేస్తుంది.

()మద్యపానం,దూమపానానికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా మితంగా తీసుకుంటే మంచిది.

()ఒత్తిడి దరి చేరకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తర్వాత ప్రజల్లో భయం,ఆందోళన,విచారణ వంటివి పెరిగిపోయాయి. కాబట్టి ఒత్తిడిని అధిగమించేలా వ్యాయామం,యోగా వంటివి మంచి ఫలితాన్నిస్తాయి.

() తీవ్రమైన ఊబకాయం, మధుమేహం మరియు గుండె జబ్బులతో సహా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు ఆరోగ్య విధానంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. లేదంటే ఈ వ్యాధులు మరింత ముదిరి ప్రాణాంతకంగా మారడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -