Thursday, May 16, 2024
- Advertisement -

సల్మాన్ మరో హీరోయిన్ ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు!

- Advertisement -

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు హీరోయిన్లను ఎంకరేజ్ చేసే తత్వం బాగానే ఉంది.

గతంలో అనేక మంది హీరోయిన్లను సల్లూ  ఎంకరేజ్ చేశాడు. వాళ్లకు తను అవకాశాలను ఇవ్వడంతో పాటు.. అవకాశాలను ఇప్పించాడు. వారి కెరీర్ లకు ఊపునిచ్చాడు.  ఐశ్వర్యరాయ్, కత్రినాకైఫ్ , జరీనా ఖాన్.. వంటి వాళ్లందరికీ సల్మాన్ మద్దతు ఉండేది.

ఆ హీరోయిన్లు బాలీవుడ్ లో అంత కాస్త కుదురుకొనే వరకూ సల్మాన్ అండగా నిలిచాడు. వారంటూ నిలదొక్కుకొన్నాకా వారు సల్మాన్ ను పట్టించుకోవడం మానేశారు. అది వేరే కథ. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సల్మాన్ మరో హీరోయిన్ ను ప్రోత్సహిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
ఆమె పేరు  నటాషా స్టాన్కోవిక్. సెర్బియా దేశానికి చెందిన మోడల్. ఆ మధ్య బిగ్ బాస్ 8లో పార్టిసిపేట్ చేసి గుర్తింపు పొందింది. ఆ రియాలిటీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడని వేరే చెప్పనక్కర్లేదు. మరి అలా కలిగిన పరిచయం తో ఇప్పుడు సల్మాన్ ఆమెకు అవకాశాలు ఇప్పిస్తున్నాడని టాక్. ప్రస్తుతం నటాషా చేతిలో కొన్ని బాలీవుడ్ సినిమాలున్నాయి.
అవన్నీ కూడా సల్మాన్ చొరవ వల్ల.. సల్మాన్ సిఫార్సుతో దక్కినవని తెలుస్తోంది! మరి కత్రినా, జరీనాల తర్వాత సల్లూ మరో హీరోయిన్ ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు కనపడలేదు. నటాషాతో ఆ లోటు తీరుతోందేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -