Friday, May 9, 2025
- Advertisement -

‘హైపర్’ ఆది పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా..?

- Advertisement -

జబర్దస్త్ షోతో హైపర్ ఆది ఏ రెంజ్ లో ఫేమస్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇటివలే ఆది పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. హైమర్ ఆది ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. ఇప్పుడా అమ్మాయిని సీక్రెట్ గా పెళ్లాడాడని అంటున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా.. చాలా పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిథుల సమక్షంలో ఓ ఇంటివాడయ్యాడని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంతో అనేది తెలియాల్సి ఉంది. ఆది పెళ్లాడిన అమ్మాయి టీవీ సీరియల్ హీరోయిన్ అని …అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘మేడ మీద అబ్బాయి’ సినిమాలో ఆది ఫ్రెండుగా నటించిందట. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించి.. అది కాస్త పెళ్లికి దారితీసిందని చెప్పుకొంటున్నారు. అయితే ఇది ‘మేడ మీద అబ్బాయి’ షూటింగ్ లో భాగంగా తీసిన ఫొటో అని, ఇందులో నిజం లేదని మరికొందరు అంటున్నారు. కావాలని సరదాగా ఈ ఫొటోని బయిటకు వదిలారని, ఆధి పెళ్ళి అంటే అందరూ మాట్లాడుకుంటారని, అలాగే సినిమా గురించి కూడా పబ్లిసిటీ అవుతుందని ఈ ఫొటోని లీక్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే.. ఆదీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. రహస్యంగా పెళ్లి చేసుకొన్నట్టు మరో వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు రిసెప్షన్ ని మాత్రం హైదరాబాద్ లో అదిరిపోయే రేంజ్ లో నిర్వహించనున్నారని అనేస్తున్నారు. మరి ఇందులో అసలు నిజం ఏంటో తెలియాలంటే.. ఆది నోరు విప్పాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -