పెళ్ళికి సిద్దమైన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

- Advertisement -

సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఎంతోమంది ప్రేక్షకులను అలరించే సుడిగాలి సుదీర్ కు ఎంతో క్రేజ్ ఉంది. బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిధంగా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తున్న సుడిగాలి సుధీర్ వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సుధీర్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

ఇక బుల్లితెరపై ఎంతో క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్న జంటలలో యాంకర్ రష్మి-సుధీర్ జంట ఒకటి అని చెప్పవచ్చు. ఈ జంట బుల్లి తెరపై కనిపిస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకేనేమో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు.. పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.

- Advertisement -

ఎపుడు బిజీగా ఉండే సుధీర్ పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడట. సుధీర్ స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా మంచి మ్యాచ్ కోసం తెగ ట్రై చేశారట. చివరకు ఓ అమ్మాయి సుధీర్ కు నచ్చడం మ్యాచ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. జాతకలు కూడా కలవడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడట. సుధీర్ కు దగ్గర బంధువుల అమ్మాయి అని తెలుస్తుంది. అంతే కాదు అమ్మాయిది కూడా కృష్ణా జిల్లానే కావడంతో త్వరలోనే పెళ్ళి జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

పుష్ప ఓటీటీ రిలీజ్ డేట్

బాలయ్యను ఢీ కొట్టనున్న జయమ్మ

చిన్న సినిమాలు బతకాలి.. పెద్ద సినిమాలు ఆడాలి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -