Sunday, May 12, 2024
- Advertisement -

వ‌ర్మ సినిమాలో వైస్రాయ్ ఘ‌ట‌నె నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోందా….

- Advertisement -

వివాదాల ట‌పాకాయ్ వ‌ర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తీస్తుండ‌టంతో ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపారు. అప్ప‌టినుంచి వ‌ర్మ‌,టీడీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. అయితె వ‌ర్మ తీస్తున్న సినిమాపై టీడీపీకి ఎందుకు ఉలుకు పాటొ అర్థ‌మ‌వ్వ‌ట్లేదు.

తారక రామారావు జీవితంలోని ఓ కోణాన్ని తీస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు నిప్పు అని చెప్పుకొనె బాబుకు టీడీపీ నాయ‌కుల‌కు ఎందుకంత భ‌యం అన్న‌దె ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌ధానంగా సినిమా నిర్మాత వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. కేవలం ఆ కోణంలో మాత్రమే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టిడిపి ఆందోళనకు మరెన్నో కారణాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి పరిచయం, పెళ్లి దగ్గరి నుంచి ఆయన మృతి చెందే వరకు మాత్రమే సినిమా తీస్తానని వర్మ ప్రకటించారు. ప్ర‌ధానంగా వైశ్రాయ్ హోట‌ల్ ఘ‌ట‌న‌నె ప్ర‌ధానంగా సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టించారు.

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం హఠాత్తుగా తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోనున్నట్లు ఎన్టీఆర్ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన హఠాత్తుగా అలా ప్రకటించడం వెనుక ఏదైనా దాగి ఉందా అనే యాంగిల్‌ను, కొత్త కోణాన్ని రామ్ గోపాల్ వర్మ వెల్లడిస్తారా అనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ చివరి రోజుల గురించి చెప్పాలంటే వైస్రాయ్ హోటల్ గురించి మాట్లాడాల్సిందే. వైస్రాయ్ ఘటనపై ఆయన ఏం చెబుతారనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఈ సినిమాకు వైసిపి నేత నిర్మాత కావ‌డం .. వైస్రాయ్ ఘటనలో చంద్రబాబును లాగి, ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తారేమోనని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మా నాయ‌కుడు ఎప్పుడు నీతి రాజ‌కీయాలే చేస్తున్నాని బాబు ఎప్పుడూ గొప్ప‌లు చెప్పుకునె టీడీపీ నాయ‌కుల‌కు వ‌ర్మ సినిమాపై అంత ఉలుకెందుక‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -