Thursday, May 16, 2024
- Advertisement -

వివాదాల జ‌బ‌ర్ద‌స్థ్!

- Advertisement -

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్థ్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. నవ్వించడంలో ఎంత పాపులర్ అయిందో అలాగే వివాదాల‌తోనూ అంతే ఫేమ‌స్ అయింది ఈ షో. ఇందులో క‌మెడియ‌న్లు చేస్తోన్న స్కిట్లు నిత్యం ఏదో ఓ సామాజిక వ‌ర్గాన్నో.. లేదంటే బ‌య‌ట వృత్తులు చేసుకునే వాళ్ల‌నో కించ‌ప‌రిచే విధంగా ఉంటున్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ మ‌ధ్యే క‌మెడియ‌న్ ధ‌న్ రాజ్ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై చేసిన ఓ స్కిట్ వివాదాస్ప‌ద‌మైంది. గ‌తంలోనే వేణు చేసిన ఓ క‌ళ్లు గీత కార్మికుడి స్కిట్ ఆ సామాజిక వ‌ర్గాన్ని బాగా హ‌ర్ట్ చేసింది. జూబ్లీహిల్స్ లో వేణుపై క‌ళ్లుగీత కార్మికుల సంఘం దాడి కూడా చేసింది. అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌ర్వాత కూడా చాలా స్కిట్లు వివాదాస్ప‌దం అయ్యాయి. ఇక స్కిట్లు మాత్ర‌మే కాదు.. అందులో క‌మెడియ‌న్లు కూడా నిత్యం ఏదో ఓ వివాదంలో ఇరుక్కుంటున్నారు.

మొన్న‌టికి మొన్న సుడిగాలి సుధీర్ చేసిన ర‌చ్చ అంత ఈజీగా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. జూబ్లీహిల్స్ లో త‌న కార్ ను ఢీ కొట్టార‌ని రోడ్డుపై ఓ వ్య‌క్తిపై నానా వీరంగం చేసాడు సుధీర్. వాళ్ళు హాస్పిట‌ల్ కు వెళ్తున్నామ‌ని.. కాళ్లు ప‌ట్టుకుని వేడుకున్నా ఆయ‌న క‌నిక‌రించలేదు. మీడియాను కూడా తిట్టాడు. ఆ మ‌ధ్య చ‌మ్మ‌క్ చంద్ర‌పై కూడా అమ్మాయిల‌ను వాడుకుంటాడ‌ని కొన్ని వార్త‌లొచ్చాయి. జ‌బ‌ర్ద‌స్థ్ లో జ‌నాన్ని న‌వ్వించే వీళ్లు.. బ‌య‌ట మాత్రం ఇంత‌లా రెచ్చిపోవ‌డం కొత్త చ‌ర్చ‌ల‌కు దారిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -