మూడున్నర దశాబ్దాల పాటు తమిళ రాజకీయాల్లో తమిళ సామ్రాజ్య రాణిగా చక్రం తిప్పిన పురుచ్చితలైవి జయలలిత వ్యక్తిగత జీవితంలో కూడా రకరకాల పుకార్లు ఉన్నాయి. జయలలిత సినిమా జీవితంతో పాటు రాజకీయా జీవితంపై కూడా లెక్కలేనన్ని రూమర్లు ఆమెపై జోరుగానే వచ్చాయి.
సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఆంధ్రుల అందాల హీరో శోభన్‌బాబును ప్రేమించారన్న టాక్ ఉంది. శోభన్‌బాబు మాటల్లో కూడా ఇదే విషయం స్పష్టమైంది. ఇక వారిద్దరి మద్య స్నేహం మాత్రమె ఉందని, మరికొందరు ప్రేమే కాదు అన్ని బందాలు ఉన్నాయని ఇలా అనేకమంది అనేక రకాలుగా అనుకునేవారు.
అప్పట్లో శోభన్ బాబు జయలలితలకు ఒక కూతురు కూడా ఉందన్న టాక్ కూడా వచ్చింది. జయ – శోభన్‌బాబు తమ బంధానికి గుర్తుగా పుట్టిన కుమార్తెకు శోభన అనే పేరు పెట్టారని కొందరు అంటుంటే…. అమ్మ అభిమానులు దీనిని తీవ్రంగా ఖండించారు. ప్రజలనే తల్లిగా చూసే ఆమె, తన సొంత బిడ్డని అలా వదులుకోదని అనేవారు. ఇక ఇప్పుడు జయలలిత మరణాంతరం జయలలిత కూతురు ఫోటో ఇదేనంటూ ఓ అమ్మాయి ఫోటో ట్రెండ్ అవుతోంది. ఈ వార్త ఎలా ఉన్నా ఇంతవరకు శోభన్ బాబు, జయ కూతురు శోభన ఎవరౌ అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
Related
