Wednesday, May 22, 2024
- Advertisement -

జ‌య‌ల‌లిత లైఫ్ సీక్రెట్స్ ఇవే!

- Advertisement -
jayalalitha life secrets

జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడు సీఎంగా ఎదిగిన క్ర‌మంలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు.. అమ్మ ప్ర‌స్థానం చూస్తే….. 

మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో ఫిబ్రవరి 24, 1948న జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది జ‌య‌ల‌లిత. జయలలిత అసలు పేరు కోమలవల్లి. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. 

తమిళనాడు రాజకీయాలకి.. 1981లో ప్రవేశించి ఎంజీ రామచంద్రన్ అనుచ‌రురాలిగా ఉండేవారు. ఆయ‌న మరణానంతరం ఆయ‌న‌ భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు సిఎం గా చేసిన ఆమె ఎక్కువ రోజులు ఆ పదవిలో ఉండలేకపోవడంతో… ఆమె ప్లేస్ లోకి జ‌య‌ల‌లిత ఎంట్రీ ఇచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికలలో జ‌య‌ల‌లిత విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించింది. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది.

2006లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె ఓటమి పాల‌య్యి మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.

సినిమా రంగ ప్ర‌స్థానం :

కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది. ఆమె న‌టించిన తెలుగు సినిమాల లిస్ట్ చూస్తే….

కథానాయకుని కథ(1965)

మనుషులు మమతలు(1965)

ఆమె ఎవరు? (1966)

ఆస్తిపరులు (1966)

కన్నెపిల్ల (1966)

గూఢచారి 116(1966)

నవరాత్రి (1966)

గోపాలుడు భూపాలుడు (1967)

చిక్కడు దొరకడు(1967)

ధనమే ప్రపంచలీల(1967)

నువ్వే (1967)

బ్రహ్మచారి (1967)

సుఖదుఃఖాలు(1967)

అదృష్టవంతులు(1968)

కోయంబత్తూరు ఖైదీ(1968)

తిక్క శంకరయ్య(1968)

దోపిడీ దొంగలు(1968)

నిలువు దోపిడి(1968)

పూలపిల్ల (1968)

పెళ్ళంటే భయం(1968)

పోస్టుమన్ రాజు(1968)

బాగ్దాద్ గజదొంగ(1968)

శ్రీరామకథ (1968)

ఆదర్శ కుటుంబం(1969)

కథానాయకుడు(1969)

కదలడు వదలడు(1969)

కొండవీటి సింహం(1969)

పంచ కళ్యాణి దొంగల రాణి (1969)

ఆలీబాబా 40 దొంగలు (1970)

కోటీశ్వరుడు (1970)

గండికోట రహస్యం(1970)

మేమే మొనగాళ్లం(1971)

శ్రీకృష్ణ విజయం(1971)

శ్రీకృష్ణసత్య (1971)

భార్యాబిడ్డలు(1972)

డాక్టర్ బాబు (1973)

దేవుడమ్మ (1973)

దేవుడు చేసిన మనుషులు (1973)

లోకం చుట్టిన వీరుడు(1973)

ప్రేమలు – పెళ్ళిళ్ళు(1974)

జయ మొదటి చిత్రం

” చిన్నడ గొంబె కన్నడ ” సినిమా సూపర్ హిట్ అయ్యింది

జయలలిత మొదటి తెలుగు చిత్రం.. ” మనుషులు మమతలు ” ఈమెను మంచి స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.

జ‌య‌ల‌లిత రాజ్య‌స‌భ ప్ర‌స్థానం…..

– 1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది.

– 1989 గెలుపు,

– 1991 గెలుపు.

– 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ

– 2001 లో అత్యధిక మెజారిటీతో విజ‌యం

– 2006 లో ఓటమి.

– 2011 లో తిరుగులేని ఎన్నిక.

– 2016 లో కూడా సర్వేలు త‌ల‌కిందులు చేస్తూ వ‌రుస‌గా రెండోసారి రికార్డు విజ‌యం

ఎంజీఆర్‌తో జ‌య‌ల‌లిత అనుబంధం :

ఎంజీఆర్ స‌ర‌స‌న ఎన్నో సినిమాలో జ‌య‌ల‌లిత నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో వచ్చాక.. జయలలిత కూడా రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నారు. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.

Related

  1. మహేష్ బాబు భార్య లైఫ్ సీక్రెట్స్
  2. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!
  3. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  4. బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -