Saturday, April 27, 2024
- Advertisement -

ఆస్కార్ వేదికపై నగ్నంగా WWE స్టార్!

- Advertisement -

లాస్ ఏంజిల్స్ వేదికగా 66వ ఆస్కార్ వేడుకలు అంరగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈసారి ఆస్కార్ వేడుకల్లో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ సినిమాలు సత్తాచాటగా ప్రతిసారి ఆస్కార్‌ వేడుకల్లో ఏదో ఒక అంశం హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సారి WWE స్టార్ జాన్ సేనా అందరిని ఆశ్చర్యపర్చాడు.

wweతో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లో నటించాడు జాన్ సీన. ప్రపంచవ్యాప్తంగా సేనకు అభిమానులుండగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి ఒంటిమీద ఏమి లేకుండా నగ్నంగా ప్రైవేట్ పార్ట్ వద్ద ఓ అట్టముక్క అడ్డం పెట్టుకొని స్టేజిపైకి వచ్చాడు. జాన్ సీనను చూసిన వారంతా షాక్‌కు గురికాగా మైక్ వద్దకు వచ్చి కాస్ట్యూమ్స్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్పేశారు. అనంతరం జాన్‌సీనకు చీరలా చుట్టుకునే కాస్ట్యూమ్ ఒకటి స్టేజిపైనే వేయగా బెస్ట్ కాస్టూమ్‌ డిజైన్‌ అవార్డు పూర్ థింగ్స్‌ సినిమాకు గానూ హోలి వెడ్డింగ్‌టన్‌ అందుకున్నారు.

ఇక మరోసారి ఆస్కార్ వేదికపై సందడి చేసింది ఆర్ఆర్ఆర్. ఆస్కార్ వేదికపై స్టంట్స్ కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో వేయగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమాలోని రెండు యాక్షన్ షాట్స్ ని చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -