టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు, నందమూరి ఫ్యామిలీ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటారు. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల హీరోలు ఒకే సినిమాలో నటిస్తే అది వింతే అవుతుంది. ఈ రెండు కుటుంబాలకు చెందిన నందమూరి కళ్యాణ్‌రామ్-మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు.
అయితే ఈ మల్టీస్టారర్‌లో ముందుగా అనుకున్న హీరోలు వేరా ? యంగ్‌టైగర్ ఎన్టీఆర్-స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించాల్సి ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. అగ్ర నిర్మాత కేఎస్.రామారావు ఎన్టీఆర్-అల్లు అర్జున్‌ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్‌ను తయారు చేయించారట. ఈ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి ముందుగా ఎన్టీఆర్,బన్నీకే వినిపించాడట. అయితే వీరిద్దరు ఈ స్టోరీపై ఆసక్తి చూపలేదని సమాచారం. ఎలాగైనా నందమూరి-మెగా హీరోల కాంబినేషన్‌లో సినిమా చేయాలని కేఎస్ రామారావు పట్టుపట్టారట.
దీంతో ఆయన స్క్రిప్ట్‌ను మరో నందమూరి యువహీరో కళ్యాణ్‌రామ్, సాయిధరమ్ వద్దకు పంపించారట. స్టోరీ విన్న ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటిస్తాం అని చెప్పారట. ఏదేమైనా బన్నీ చేయను అని చెప్పిన సినిమాని ధరం తేజ్ చేసి బన్నీకి షాక్ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆ చేయను అని చెప్పిన సినిమాని కళ్యాణ్ రామ్ చేసి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చాడు. ఏదేమైనా ఈ స్టోరీని ఎన్టీఆర్-బన్నీ ఓకే చేసి ఉంటే టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్‌గా మిగిలిపోయేది అని అంటున్నారు.
Related