Tuesday, May 21, 2024
- Advertisement -

అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ

- Advertisement -

తెలుగు సినిమాలు విరివిగా చూసే వారికి ” చెప్పను బ్రదర్ ” అనే సంబోధన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గురించి సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లూ అర్జున్ చేసిన వ్యాఖ్యలు అవి.  

పవన్ కళ్యాణ్ గురించి ఫంక్షన్ లో చెప్పమని కోరినప్పుడు అల్లూ అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అప్పట్లో. ఆ తరవాత ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి అడిగినా చెప్పను బ్రదర్ అంటూనే ఒచ్చాడు అల్లూ అర్జున్. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఈ విషయం పిచ్చ కోపం రేపింది, దీని మీద ఒక మానసు ఆడియో లాంచ్ లో అల్లూ అర్జున్ సమాధానం కూడా చెప్పాడు. పవన్ ఫాన్స్ చేసే గోల తట్టుకోలేక తాను అలా అన్నాను అనీ వారి గోల శృతి మించుతోంది అనీ అన్నాడు అర్జున్. ఇప్పుడు తాజాగా జరిగిన తిక్క ఆడియో లో దీనికి సమాధానం చెప్పాడు సాయి ధరం తేజ.

పవర్ స్టార్ అభిమానులు యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ముందు కూడా పవర్ స్టార్ అని నినాదాలు చేశారు. ఇక దీనికి సాయిధరమ్ తేజ్, “‘అరవండి బ్రదర్’ మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పవర్ స్టార్ అని చెబుతా. మీ ప్రేమను నేను ‘ఆపలేను బ్రదర్’. అరవండి.. ఇంకా అరవండి.. మీతో పాటు నేనూ అరుస్తా అని పవర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్” అని అన్నారు. సాయిధరమ్ తేజ్ నుంచి వచ్చిన ఈ ఉత్సాహవంతమైన సమాధానంతో అభిమానులంతా హ్యాపీ అయిపోయారు. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగిన ‘తిక్క’ ఆడియో ఆవిష్కరణ వేడుకలో సాయిధరమ్ తేజ్ పై డైలాగ్ వదిలారు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related

  1. షాకుల మీద షాకులు ఇస్తున్న వరుణ్ తేజ్…
  2. సాయి ధరమ్ తేజ్ కన్ను పడింది
  3. అల్లూ శిరీష్ అదుర్స్ అనిపించాడు
  4. పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?
  5. కారు ఒక్కటే కాదు.. అవి కూడా అమ్మేస్తున్నాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -