Tuesday, May 14, 2024
- Advertisement -

బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ప‌వ‌న్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య కొన్ని రోజుల క్రింద సోష‌ల్ మీడియా సాక్షిగా ర‌భ‌స జ‌రిగిన విష‌యం తెలిసిందే. పవర్ స్టార్ గురించి మాట్లాడమని పవన్ ఫ్యాన్స్ బన్నీ ని అడిగితే నేను మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్‌.. అన్న పాపానికి బన్నీ పై పవన్ ఫ్యాన్స్ ఓ రెంజ్ లో సెటైర్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ తరువాత అల్లు అర్జున మళ్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ప్ర‌త్యేకంగా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సివ‌చ్చింది.

ఏదైన వేడుక జరుగుతున్నప్పుడు ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌కండి అని పవన్ ఫ్యాన్స్ ని వేడుకొన్నాడు బ‌న్నీ. ఆ వివరణ వల్ల పవన్ ఫ్యాన్స్ సంతృప్తి ప‌డ‌తారేమో అనుకున్నారు అంతా. కానీ అల్లు అర్జున్ కి మళ్లీ షాక్ తప్పలేదు. అయితే సైమా వేడుక‌ల్లో బన్నీకి ఉత్త‌మ స‌హాయ‌న‌టుడుగా అవార్డు ద‌క్కింది.

అప్పుడు అల్లు అర్జున్ అవార్డు తీసుకొని, మాట్లాడ‌డం మొద‌లెట్టేస‌రికి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత మంది `ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్‌` అంటూ అర‌చి గోల గోల చేశారు. దాంతో బ‌న్నీ కాస్త అస‌హ‌నానికి గురైన‌ట్టు టాక్‌. ‘గ‌మ్మునుండ‌వ‌య్యా’ అంటూ రుద్ర‌మ‌దేవిలో త‌న డైలాగ్‌ని ఈ వేదిక‌పై బ‌న్నీ రిపీట్ చేయాల్సివ‌చ్చింది. కానీ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏ మాత్రం ఆగ‌లేదు. దాంతో బన్నీ చిన్న పాటి స్పీచ్‌తోనే స‌రిపెట్టాల్సివ‌చ్చింది. మళ్లీ అల్లు అర్జున్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ సెగ మొద‌లైంద‌న్న‌మాట‌. 

Related

  1. ఎన్టీఆర్ ని బన్నీ ఏం అన్నాడో తెలుసా?
  2. బన్నీ దొంగ లెక్కలు చూపించాడా?
  3. బన్నీ కి చిన్న ప్రమాదం తప్పింది!
  4. రామ్ చరణ్ కావాలనే బన్నీని అవాయిడ్ చేసాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -