Monday, May 20, 2024
- Advertisement -

లుంగీ మీద బన్నీ ఊర మాస్ పార్టీ

- Advertisement -

అల్లూ అర్జున్ సరైనోడు సినిమా ప్రస్తుతం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం సంచలనం గా మారింది. ఈ సినిమా యూనిట్ మొత్తం 100 రోజుల వేడుక ని పర్సనల్ గా జరుపుకున్నారు. అయితే ఈ పార్టీ మొత్తం బన్నీ స్వయంగా ఇవ్వడం విశేషం.

సినిమా యూనిట్ సభ్యులు అందరూ బన్నీ ఇచ్చిన పార్టీ ని హ్యాపీగా తీసుకున్నారు. ఈ పార్టీ కి బన్నీ పెట్టిన పేరు ” ఊర మాస్ పార్టీ ‘ పేరుకి తగ్గట్టుగానే క్లాస్ గా లేకుండా ప్రోగ్రాం అంతా మాస్ గా ప్లాన్ చేసాడు బన్నీ బాబు. ఫుడ్ వెరైటీ ల దగ్గర నుంచీ డ్రింక్ ల వరకూ అన్నీ వింతగా ఏర్పాటు చేసాడు బన్నీ.

ఒక లుంగీ మీద ఊర మాస్ పార్టీ అని రాయించి మరీ బన్నీ ఈ రకంగా ఏర్పాట్లు చేసాడు. బన్నీ స్వయంగా ఇచ్చిన పార్టీ కావడం తో చివరి వరకూ అక్కడే ఉండి అందరినీ చూసుకుని అందరితో సేల్ఫీలు దిగాడు మనోడు.

Related

  1. బన్నీ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాడు!
  2. బన్నీ మళ్లీ తండ్రి కాబోతున్నాడా?
  3. మరో సారి బన్నీ సరసన శృతి హాసన్
  4. తమ్ముడు కోసం బన్నీ ఏం చేస్తున్నాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -