Thursday, May 2, 2024
- Advertisement -

మంచి మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూటింగ్ బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. నిన్న ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ కుమార్ మన్నవ బర్త్ డే. స్పెషల్ కేక్‌ను తెప్పించి బర్త్ డేని సెలబ్రేట్ చేశాడు.

ఎన్టీఆర్ తన బర్త్ డే గుర్తుంచుకొని మరీ ప్రేమతో కేక్ తీసుకొచ్చి తినిపించడంతో కుమార్ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా లో షేర్ చేసిన కుమార్… నా పుట్టిన రోజు గుర్తుంచుకొని మరీ, నేను ఏం తింటానో తెలుసుకొని అలాంటి కేక్ తెప్పించి నా బర్త్ డే సెలబ్రేట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

మీరు నాపై, నా కుటుంబం పై చూపించే ప్రేమ, మాకు ఇచ్చే సపోర్ట్ కి నేనేమి చెప్పగలను. ఎన్టీఆర్ అంటే మానవత్వం, ప్రేమకు నిదర్శనం. మీతో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలపగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. వార్‌ 2తో పాటు దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -