Monday, April 29, 2024
- Advertisement -

దేవర ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 4న విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో సెకండాఫ్‌ అద్భుతంగా ఉంటుందని కొరటాల శివ చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాంగ్స్ షూట్ తో, ఇటు యాక్షన్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని..ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని కొరటాల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

పాటల చిత్రీకరణ కోసం దేవర మేకర్స్ విదేశీ లొకేషన్స్ నే ఎంచుకుంటున్నారట. ఇక దేవర పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేపథ్యంగా కథ సాగేలా కొరటాల ప్లాన్ చేస్తున్నారట. అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో కథ సాగనుంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ పాత్రలో తారక్ కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -