- Advertisement -

అన్యాయం : ఎన్టీఆర్ ని తోక్కేస్తున్న బాలకృష్ణ ?

- Advertisement -

నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్కు, నాకు ఎవడైనా ఎదురు ఒచ్చినా వాడికే రిస్క్ అంటాడు బాలకృష్ణ. లెజెండ్ సినిమాలో తన పాత్ర కోసం చెప్పుకున్న బాలయ్య నిజజీవితంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు అని విమర్శలు ఒస్తున్నాయి, బాలకృష్ణ 100 వ చిత్రం కోసం ఇప్పటికే వివిధ డైరెక్టర్ లు కథలతో కుస్తీ పడుతూ ఉండగా బాలయ్య కృష్ణ వంశీ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అని అంటున్నారు.

ఈ సినిమా లో ప్రత్యేకం గా నందమూరి హీరోలు అందరూ కనపడాలి అనేది బాలయ్య కోరికట .. అందునా 100 వ చిత్రం కావడం తో ఇలాంటి ముచ్చటలు తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నట్టు ఉన్నాడు బాలయ్య బాబు. 

మొదటగా ఈ సినిమా లో నారా రోహిత్ కి క్యామ్యూ ఇచ్చారు, ఇప్పుడు తారక రత్న ని విలన్ గా చూపించబోతున్నారు అని తెలుస్తోంది. దాని తర్వాత కళ్యాణ్ రాం కి కూడా ఒక క్యామ్యో ఉండాలి అని బాలయ్య స్వయంగా కోరారట కానీ ఎన్టీఆర్ గురించి మాత్రం ప్రస్తావించలేదు అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నారా రోహిత్ కు ఛాన్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు ఆ అవకాసం ఇవ్వకపోవడంతో ఫిలిం నగర్ ఇదొక హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య కావాలనే ఇదంతా చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -