Sunday, May 5, 2024
- Advertisement -

త్రివిక్రమ్‌కి మరో సూపర్ షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… ఆ స్పెషల్‌కి నో

- Advertisement -

పాపం త్రివిక్రమ్ శ్రీనివాస్….రైటర్‌గా ఉన్నప్పటి నుంచీ కూడా ఇంగ్లీష్, కొరియన్ సినిమాలను కాపీ కొట్టినవాడే కానీ అప్పట్లో అన్నీ హిట్స్ కావడంతో ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ‘అ…ఆ’ సినిమా కోసం తెలుగు సినియర్ మోస్ట్ నవలా రచయిత నవలను కాపీ కొట్టి, ఆ రచయితకు క్రెడిట్స్ ఇవ్వకుండా అవమానించడంతో పరువు పోగొట్టుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఆ ప్రభావం మొత్తం కూడా అజ్ఙాతవాసిపై పడింది. 15 కోట్లపైనే రెమ్యూనరేషన్ తీసుకునే త్రివిక్రమ్…..కాపీ కథలతో, కాపీ సీన్లతో టైం పాస్ చేస్తూ చెత్త సినిమా తీయడంతో ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలో కూడా పరువు పోగొట్టుకున్నాడు త్రివిక్రమ్.

అజ్ఙాతవాసి హిట్ అయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. టెంపర్ సినిమా నుంచీ కూడా తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్టీఆర్……. ఇప్పటి వరకూ ఫ్లాప్ అయితే ఎదుర్కోలేదు. ఆ ట్రాక్ రికార్డ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అందుకే అనిరుథ్ మ్యూజిక్ విషయంలో సాంగ్స్ కంపొజిషన్ అయిపోయాకే నిర్ణయం తీసుకుంటానన్నాడు. అనిరుథ్ ఇప్పటికే కంపోజ్ చేసిన రెండు సాంగ్స్‌ని ఒకే చేయడంతో ఆ త్రివిక్రమ్‌కి ఒక సమస్య తీరిపోయినట్టయింది. అయితే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది త్రివిక్రమ్‌కి. ఎన్టీఆర్ సినిమాలో సునీల్ కోసం ఓ ప్రత్యేక పాత్ర క్రియేట్ చేశాడు త్రివిక్రమ్. ఆ పాత్రకు ఒకే అన్నాడు ఎన్టీఆర్.

అయితే తన స్క్రిప్ట్‌కి ఇంకా ఎక్కువ బలం చేకూర్చాలని, అలాగే సినిమాలో డైరెక్టరే ఎక్కువ కనిపించాలన్న ఉద్ధేశ్యంతో త్రివిక్రమ్ ఒక సీనియర్ హీరో కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట త్రివిక్రమ్. సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర స్టైల్‌లో ఆ క్యారెక్టర్ ఉంటుందట. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ స్పెషల్ క్యారెక్టర్ అస్సలు బాగాలేదని, కథలో భాగంగా కనిపించడంలేదని చెప్పాడట. అన్నింటికీ మించి జనతా గ్యారేజ్‌లో కూడా మోహన్‌లాల్ లాంటి స్పెషల్ క్యారెక్టర్‌తో యాక్ట్ చేసి ఉన్న నేపథ్యంలో అనవసరమైన పోలికలు వచ్చే అవకాశం ఉందని…… ఆ క్యారెక్టర్‌ని తీసేయమన్నాడట ఎన్టీఆర్. త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో ప్రతి సీన్‌ కూడా ది బెస్ట్ వర్క్ వచ్చే వరకూ ఎన్టీఆర్ కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈ విషయాలు తెలుసుకుంటున్న ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఒక్క ఫ్లాప్ పడితే ఎంత పెద్ద డైరెక్టర్ పరిస్థితి అయినా ఇలానే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -