Saturday, April 27, 2024
- Advertisement -

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్..రెండు పార్టులేనా?

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. ప్రస్తుతం గోవాలో దేవర షూటింగ్ జరుగుతుండగా జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ మధ్య సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.

దేవర తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్‌తో వార్ 2 షూటింగ్‌లో పాల్గొననున్నారు. దీంతో పాటు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు జూనియర్. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సినిమా సైతం రెండు పార్టులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ వరుస సినిమాలతో అలరించడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్‌ను యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ఈ సినిమాలో చూపించనున్నారట నీల్. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -