Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ షాక్..తిహార్ జైలుకు కవిత

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఈడీ మూడు రోజుల విచారణ అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషియల్ కస్టడికి అనుమతించింది న్యాయస్థానం. దీంతో కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉండనున్నారు కవిత.

కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. కవితకు బెయిల్ ఇవ్వొద్దని..ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.

ఇక తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు కవిత తరపు న్యాయవాది.వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని, అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 విచారణ జరపనుంది న్యాయస్థానం. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు కవిత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -