Saturday, April 27, 2024
- Advertisement -

బీజేపీ పోటీ..ఉనికి కోసమేనా?

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలు కేటాయించారు. అయితే ఈ 6 స్థానాల్లో బీజేపీ ఎన్ని చోట్ల గెలుస్తుందా అంటే సమాధానం లేని ప్రశ్నే. ఇక ప్రధానంగా నెల్లూరులో బీజేపీ పరిస్థితి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. 1980ల్లో ఈ జిల్లాలో బీజేపీకి మంచి పట్టు ఉండేది. కానీ ఆ తర్వాత నాయకత్వలేమి, కేంద్రంలో అధికారంలో ఉన్నా సహకారం కరువవడంతో ఇప్పుడు ఉనికి చాటుకోవడం కష్టంగా మారింది.

అయితే ఈసారి నెల్లూరు నుండి పోటీ చేసి పట్టు దక్కించుకోవాలని భావించినా టీడీపీ మాత్రం ఈ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు ససేమీరా చెప్పేసింది. 2019లో ఇక్కడ బీజేపీకి అభ్యర్థికి కేవలం 12,513 ఓట్లు మాత్రమే వచ్చాయంటే బీజేపీ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఇక నెల్లూరు బీజేపీ అనగానే గుర్తుకొచ్చేది వెంకయ్య నాయుడే. భారత మాజీ ఉపరాష్ట్రపతిగా సేవలందించిన వెంకయ్య తన రాజకీయ ప్రస్థానాన్ని ఉదయగిరి నుండే మొదలుపెట్టారు. 1978లో ఉదయగిరి నియోజకవర్గం జనతా పార్టీ టికెట్‌పై గెలుపొందారు వెంకయ్య. ఆ తర్వాత 1983 ఎన్నికల్లోనూ విజయం సాధించగా 1985 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఇక్కడ బీజేపీ జెండా ఎగిరింది లేదు. 1991 నుంచి ఆరుసార్లు, కొన్నిసార్లు టీడీపీతో పొత్తులో పోటీ చేసినా బీజేపీ మాత్రం ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఈ జిల్లాల్లో బీజేపీకి నాయకులు తప్ప కేడర్‌ పెద్దగా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -