Monday, May 20, 2024
- Advertisement -

సినిమా షూటింగ్ కూడా మొదలవలేదు అప్పుడే 45 కోట్లు

- Advertisement -

శాటిలైట్ హక్కులు సినిమా , సినిమాకీ మారుతూ ఒస్తాయి. ఒకప్పుడు సినిమా విడుదల ఐన వెంటనే కూడా కాకుండా చాలా కాలం తరవాత శాటిలైట్ హక్కులు కొనే వారు కానీ ఇప్పుడు షూటింగ్ దశ లో సినిమా ఉండగానే కోట్లకి కోట్లు గుమ్మరించి మరీ సినిమాలు కొనేస్తున్నారు ఛానల్ వాళ్ళు.బాలీవుడ్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఒక్కొక్క సినిమా కీ అరవై కోట్ల వరకూ శాటిలైట్ ని అమ్ముతున్నారు అక్కడ. బడ్జెట్ లో చాలా శాతం శాటిలైట్ ల నుంచే రాబడుతూ ఉన్నారు. మొహంజదారో సినిమా కీ , దిల్ వాలే కీ , బాజీ రావ్ మస్తానీ కీ అంతే రేటు ఒచ్చింది కూడా.

కానీ తొలి సారిగా షూటింగ్ కూడా మొదలు కాకుండా నలభై ఐదు కోట్ల భారీ రేటుని దక్కించుకుంది కాబిల్ చిత్రం. హృతిక్ రోషన్-యామిగౌతం జంటగా త్వరలో మొదలుకాబోతున్న కాబిల్ సినిమా. సమ్మర్ లో షూటింగ్ మొదలుకాబోతున్న ఈ సినిమాను స్టార్ ఛానెల్ అంత రేటుని ఇప్పుడే ఇచ్చేసి దక్కించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -