Sunday, May 12, 2024
- Advertisement -

మహేష్ – పవన్ ఇద్దరినీ తలదన్నేస్తున్న హీరో అల్లూ అర్జున్

- Advertisement -

కెరీర్ లో సరైన టర్నింగ్ పాయింట్ కోసం చాలా మంది హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. మహేష్ కి పోకిరి లా , పవన్ కి ఖుషి లాగా అల్లూ అర్జున్ కి రేస్ గుర్రం తో 2014 లో సూపర్ బ్రేక్ లభించింది. అదే అతని కెరీర్ కి సూపర్ టర్నింగ్ పాయింట్ కూడా. స్టార్ హీరో స్టేటస్ కి వెంటనే ఎదిగిన హీరో అల్లూ అర్జున్ పోయిన ఏడాది సన్ ఆఫ్ సత్యమూర్తి తో కూడా యాభై కోట్లు కలక్ట్ చేసి పారేసాడు.

రుద్రమ దేవి తో మరొక యాభై కోట్ల సినిమా చేసిన మనోడు ఇప్పుడు మహేష్ – కళ్యాణ్ ల రికార్డులు కొల్లగోడుతున్నాడు. మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా కి ఏడున్నర కోట్లు రేటు దక్కగా సరైనోడు కి ఎనిమిద్దిన్నర కోట్లు దక్కిందట సీడెడ్ లో. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కర్ణాటకా లో ఎనిమిది కోట్లు దక్కించుకోగా సరైనోడు పవన కళ్యాణ్ కి షాక్ ఇస్తూ తొమ్మిది కోట్లు కి అమ్ముడయ్యాడు.

 దాంతో పాటుగా మరికొన్ని చోట్ల కూడా అల్లుఅర్జున్ మిగతా స్టార్ హీరోల రికార్డులు బ్రేక్ చేస్తూ తాను నెంబర్ వన్ రేసులో ఉన్న హీరోనే అనిపించుకు౦టున్నాడు. ఈ దెబ్బతో పవన్ , మహేష్ బన్నీ మార్కెట్ అంటే చెమటలు తెచ్చుకుంటున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -