Monday, May 6, 2024
- Advertisement -

బిజినెస్‌మేన్‌తో ప్రేమ‌లో ఉన్న కాజ‌ల్?

- Advertisement -

కాజ‌ల్ అగార్వాల్ సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌ది సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టికి వ‌రస పెట్టి సినిమాలు చేస్తునే ఉంది. తెలుగు, హింది, త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించింది కాజ‌ల్‌. అయితే కాజ‌ల్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ర్రుమ‌ర్ కుడా రాక‌పోవ‌డం విశేషం.

దీని గురించి కాజ‌ల్‌ను ప్ర‌శ్నిస్తే… నేను ఎవ‌రితోను పెద్ద‌గా క్లోజ్ ఉండ‌ను, సినిమా షూటింగ్ పూర్తి అవ్వ‌గానే నా పని నేను చేసుకుని వెళ్లిపోతాను, వేరే విష‌యాల‌ను నేను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని చెప్పుకొచ్చింది. అయితే కాజ‌ల్‌కు సంబంధించిన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

హీరోయిన్ శ్రియ మాదిరిగా కాజ‌ల్ కూడా పెళ్ళి చేసుకోబోతుందని స‌మాచారం. కాజ‌ల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌తో ప్రేమ‌లో ఉంద‌ని ,త‌న‌తోనే కాజ‌ల్ పెళ్లి ఉంటుంద‌ని ఆమె స‌న్నిహితులు ద్వారా తెలుస్తుంది. ఏదో ఒక రోజున సడన్‌గా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. నటి శ్రియ మాదిరిగా చడీ చప్పుడు లేకుండా పెళ్లి ముచ్చట ముగించుకుని తీరిగ్గా వెల్లడించే అవకాశం లేకపోలేదనే వారూ లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -