Wednesday, May 8, 2024
- Advertisement -

నారావారికి బిగ్గెస్ట్ షాక్……. వైకాపాలోకి రెండు జిల్లాలను శాసించే నాయకులు

- Advertisement -

రెండు జిల్లాల ప్రజల్లో గట్టిపట్టున్న కీలక రాజకీయ కుటుంబం మొత్తం ఇప్పుడు వైకాపాలో చేరనుందా? టిడిపి తరపున ఎమ్మెల్సీగా ఉన్న ఆ నాయకుడు టిడిపిని వీడనున్న విషయాన్ని చంద్రబాబుకు చెప్పేశాడా? ఇప్పుడు ఈ విషయమే ప్రకాశం, నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆయన భార్య పార్వతమ్మ, తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి……. ఇలా ఆ కుటుంబం నుంచి వచ్చిన నాయకులు అందరూ ప్రజల మన్ననపొందారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతిపెద్ద పారిశ్రామికవేత్తల కుటుంబం మాగుంట వారిది.

2014 ఎన్నికల సమయంలో టిడిపిలో చేరిన ఈ నాయకులు ఇప్పుడు వైకాపాకు జైకొట్టడానికి రెడీ అయ్యారు. వైకాపా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహిత మిత్రుడు అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ మేరకు జగన్‌ని కలిశాడని తెలుస్తోంది. 2019లో ఒంగోలు ఎంపి టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి వైకాపాలో చేరడానికి రెడీ అయ్యాడు. ఎమ్మెల్సీగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్న చంద్రబాబు చాలా మంది నాయకులకు వెన్నుపోటు పొడుస్తూ హ్యాండ్ ఇచ్చినట్టుగానే మాగుంటవారికి కూడా హ్యాండ్ ఇచ్చాడు.

అందుకే ఇప్పుడు మాగుంట వారి కుటుంబం మొత్తం వైకాపాలో చేరనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒంగోలు నుంచి ఎంపిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే జగన్ కూడా మాగుంటకు టికెట్ హామీని ఇచ్చాడని సుబ్బారెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల్లో మాగుంట కుటుంబానికి మంచి పేరుంది. ఇప్పటికే ఆ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు వైకాపా ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు మాగుంట వారి చేరికతో 2019 ఎన్నికల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తొంభైశాతం సీట్లలో వైకాపా విజయం సాధించినా ఆశ్ఛర్యపోవాల్సినపనిలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -