Wednesday, May 22, 2024
- Advertisement -

కాజల్ కూడా ‘దానికి’ ఓకే చెప్పేసింది అన్నమాట

- Advertisement -

ఐటెం సాంగ్స్ అంటే ఆమడు దూరంలో ఉంటుంది కాజల్ అగర్వాల్. ఐదు నిమిషాల పాటకి మహా అయితే రెండు మూడు రోజులు స్పెండ్ చెయ్యాలి అంతే కానీ కాజల్ ఎప్పుడూ ఒప్పుకునేది కాదు మరొక పక్క శృతి హాసన్ ఇలాంటి ఐటెం సాంగ్ లు బాగానే చేసింది.

తోటి కథానాయికలు శ్రుతి – తమన్నాలు ఐటెమ్ పాటలతో రెచ్చిపోతున్నాకాజల్ ఎప్పుడూ ఐటెం సాంగ్స్ మీద  ఆసక్తి చూపించలేదు. మొత్తానికి మనకి అందుతున్న సమాచారం ప్రకారం మడి విప్పేసిందట కాజల్ కూడా. భారీగా రెమ్యునరేషన్ కోరి మరీ ఒక సినిమాలో ఐటెం పాట కి ఓకే అంది. ఒక రెండు రోజుల్లో ఈ విషయాలు బయటకి వస్తాయి.

అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్ లు ఎవ్వరో ఐటెం సాంగ్ లలో డాన్స్ చెయ్యడానికి ఇష్టపడేవారు కాదు. తరవాత తరవాత ఈ ట్రెండ్ మారుతూ వచ్చింది. హీరోయిన్ క్యారెక్టర్ లతో పాటు ఐటెం పాపల్లా కూడా కనిపించడానికి ఇప్పటి హీరోయిన్ లు సై అంటున్నారు. తక్కువ రోజుల్లోనే ఈ పాటల్ని పూర్తి చేసే అవకాశం ఉండటంతో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ కూడా అందుకొనే అవకాశం ఉంటుంది. అందుకే ఐటెమ్ లపై అంతగా మోజు పెంచుకొంటున్నారు మన భామలు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -