Wednesday, May 15, 2024
- Advertisement -

అజిత్ సినిమా కోసం ఎన్టీఆర్ – చిరు ఫైట్ ?

- Advertisement -

తమిళం లో ప్రస్తుతం వర్షాలతో పాటు వేదాళం సినిమా ట్రెండ్ నడుస్తోంది. వర్షాలని తలదన్ని మరీ అజిత్ నటించిన ఈ సినిమా పెద్ద రికార్డులు కొల్లగోట్టేస్తోంది. కేవలం ఆరు రోజుల విడుదల తరవాత నలభై ఐదు కోట్లు షేర్ సాధించిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని కొందరు కాలీవుడ్ పండితులు చెబుతున్నారు.

ఈ సినిమా ని మెగా స్టార్ చిరంజీవి కి స్పెషల్ షో వేయిచడానికి చూస్తున్నారు ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం. ఆయనకీ సినిమా నచ్చితే తెలుగు లో దాన్ని రీమేక్ చెయ్యాలి అని ఆయన ప్లాన్ కాగా ఇలోగా ఎన్టీఆర్ ఈ సినిమాని స్పెషల్ షో వేసుకుని మరీ చూసేసారట. డైరెక్టర్ శివ రొటీన్ స్టోరీ ని తీసుకుని చాలా కొత్తగా చూపించిన విధానం ఎన్టీఆర్ కి బాగా నచ్చింది అని రీమేక్ ఆలోచనలో కూడా ఉన్నారు అని తెలుస్తోంది.

లాయర్ పాత్రలో శృతి పాత్ర కూడా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తెలుగు నేటివిటీ కి కూడా కథ పర్ఫెక్ట్ గా ఉండడం తో ఎవరైనా కొత్త దర్సకుడినో లోకే శివ తోనే ఈ సినిమా ని రీమేక్ చెయ్యాలి అని ఎన్టీఆర్ చూస్తున్నాడు అంటున్నారు. మరొక పక్క చిరంజీవి కి కూడా ప్రత్యేక షో వేసిన తరవాత సినిమా నచ్చేస్తే ? ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – మెగాస్టార్ లు కొట్టుకుంటారేమో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -