Saturday, May 4, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ కి దెబ్బ కొట్టిన పవన్‌, మహేష్‌!

- Advertisement -

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో పవన్‌కళ్యాణ్‌ అభిమానులకి కోలుకోలేని షాకిచ్చాడు. డిజాస్టర్లకే డిజాస్టర్‌ అంటూ వేరే హీరోల అభిమానులు పాపం పవన్‌ ఫాన్స్‌ని ఆడేసుకున్నారు. అయితే నెల తిరగకుండా మహేష్‌బాబు బ్రహ్మోత్సవం తో వచ్చి తన ఫాన్స్‌ సరదా తీర్చేసాడు. సర్దార్‌కి తమకి ఇచ్చిన దానికి వడ్డీతో సహా తిరిగిచ్చేయాలంటూ పవన్‌ ఫాన్స్‌ ఈ చిత్రాన్ని టార్గెట్‌ చేసారు.

ఫాన్‌ వార్స్‌ మాట అటుంచితే ఈ చిత్ర పరాజయాలకి పూర్తి బాధ్యులు మహేష్‌, పవనేనని ఇండస్ట్రీలో అంటున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల కథ పూర్తిగా సిద్ధం చేసుకోలేదని తెలిసినా కానీ అతడిని తొందరపెట్టి పరుగులు పెట్టించింది మహేషేనని, అతని మాట కాదనలేక, తనకి టైమ్‌ దొరక్క తోచింది తీసుకుంటూ పోయి ఆ సినిమాని అలా తయారు చేసాడని అంటున్నారు.

ఇక సర్దార్‌కి పవన్‌కళ్యాణ్‌ చేసిందేంటో అందరికీ తెలిసిందే. కథ, కథనం నాదేనంటూ పాపం బాబీని పక్కన పడేసాడు. తీరా ఆ సినిమా తల, తోక లేకుండా తయారై డిజాస్టరయింది. ఈ సినిమాల పరాజయాలకి హీరోలిద్దరే కారణమని ఇంత క్లియర్‌గా తెలుస్తోంటే కొందరేమో రెండిట్లో హీరోయిన్‌ అయిన కాజల్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. ఐరెన్‌లెగ్‌ అనేస్తున్నారు. హీరోలు చేసిన దానికి పాపం తనేం చేస్తుంది. అలా అయితే తను నటించిన హిట్‌ సినిమాల క్రెడిట్‌ కూడా కాజల్‌కే ఇచ్చేద్దామా మరి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -