Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ కోసం ఆస్ట్రేలియా నుంచి ఒచ్చేసింది

- Advertisement -

తెలుగు సినిమాకి ఇద్దరు సూపర్ హీరోలు పవన్ కళ్యాణ్ – మహేశ్  బాబు .. వీరిద్దరితో ఒకే సారి రోమాన్స్ చేసే అవకాశం కాజల్ అగర్వాల్ కి మాత్రమే దక్కింది అని చెప్పాలి.

మొన్నటి వరకూ గబ్బర్ సింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో ఆడి పాడిన కాజల్ ఇప్పుడు మహేష్ బాబు కోసం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీ అయ్యింది. ‘ఈ సినిమాలో నేను ఓ ఎన్నారై రోల్ చేస్తున్నాను. జస్ట్ ఆ మూడక్షరాలకే లిమిట్ అయ్యే కేరక్టర్ కాదు. డిఫరెంట్ కేరక్టరైజేషన్ తో ఆకట్టుకునే పాత్ర ఇది.

చాలా కేజువల్ గా ఉంటూనే.. స్త్రీల హక్కుల గురించి మాట్లాడే రోల్. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చి.. కొన్ని గోల్స్ ను అందుకునేందుకు పోరాడుతూ ఉంటాను. కలలు కనడమే కాదు.. ఆ కేరక్టర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ కూడా’ అని చెప్పింది కాజల్ . మహేష్ తో ఒక్క ఛాన్స్ కే హీరోయిన్ లు పరితపిస్తూ ఉంటె తనకి సెకండ్ ఛాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది ఆమె. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -