Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ సర్దార్‍లో మరో స్పెషాలిటీ..

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. నిన్న రిలీజ్ అయిన పాటలకు మంచి స్పందన వస్తుంది. వచ్చే నెల 8న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఐతే ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రం గురించి విశేషం బయిటకు వచ్చింది.

ఇన్నాళ్లూ తను తెరపై కనిపించే పాత్రలకు వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించే కాజల్ ..ఈ సారి తన సొంత వాయిస్ ఇవ్వబోతోంది. అంతేనా పవన్ పాడే పాటలో ..గొంతు కలపనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కథ, కథనం మాత్రం పవనే అందించాడు.

జానీ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకే పవన్ కథ రాసుకున్నాడు. భారీ అంచనాలు ఉన్నా ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని పవన్ అభిమానులు అంటున్నారు. బాలీవుడ్‍లో కూడా అత్యధిక థియేటర్స్‌ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -