- Advertisement -

నా ఇన్స్పిరేషన్ బాబాయ్ అంటున్న చెర్రీ!

- Advertisement -

రామ్ చరణ్ ఇటీవలే హైదరాబాద్ లోని ఓ కళాశాల ఫంక్షన్ కు అతిథిగా వెళ్ళాడు. సరదగా అక్కడి స్టూడెంట్స్‌తో ముచ్చాటించారు. అలాగే స్టూడెంట్స్‌‌ను ఇన్స్పైర్ చేసేలా.. కొన్ని మాటలు కూడా చెప్పాడు. ప్రేమ గురించి పెళ్లి గురించి, చదువు గురించి మాట్లాడాడు. ప్రేమించడం తప్పుకాదు కానీ ముందు మన  కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండం మంచిదని స్టూడెంట్స్‌కు చెప్పాడు.

అలాగే నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదని… స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదని అన్నాడు. ఎడ్యుకేషన్, లవ్, ఫ్యామిలీ వంటి వాటి విషయల్లో మంచి కేర్ తోసుకోవాలి అని  స్టూడెంట్స్ కు సలహా ఇచ్చాడు. అలాగే తన జీవితానికి పవన్ కళ్యాన్ ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాడు. ఇరవైయేళ్ళ వయసులో చరణ్ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడట.

ఆ సమయంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పిలిచి గంటసేపు మాట్లాడరంట. అప్పుడే తనకు జీవితమంటే ఏంటో అర్ధమయిందని చరణ్ చెప్పాడు. అమ్మా నాన్న నా జీవితానికి ఎంత ఆదర్శమో… నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్ కూడా అంతే ఉందని చెర్రీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తని ఒరువన్ అనే తమిళ రిమేక్ సినిమాలో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -