వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలలో ఉంటు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటాడు. 2019 ఎలెక్షన్స్ టార్గెట్‌గా గత ఆరు నెలలుగా జగన్ 2 వేలకుపైగా కిలోమీటర్ల పాదయాత్ర చేస్తన్నాడు. అయితే వైసీపీ అధినేత జగన్ ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విదేశీ పర్యాటనకు జగన్ కుటుంబ సమేతంగా ఇటీవల యూరప్ వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో జగన్ సాహోసపేతమైన స్కై జంప్ చేశారు.వందల కిలోమీటర్ల ఎత్తు నుండి జగన్ స్కై జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని దీనికి సంబంధించిన జగన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్ర నేటితో రెండు వందల రోజులను పూర్తిచేసుకుంది.
