జనసేనకు బిగ్ షాక్..నాదేండ్లపై తీవ్ర ఆరోపణలు

జనసేన అధినేత, పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సరోజా. కాకినాడ మాజీ మేయర్‌గా సేవలు అందించారు సరోజ. కాకినాడ రూరల్‌ జిల్లాలో టికెట్ ఆశీంచారు సరోజా…కానీ పవన్ మాత్రం పంతం నానాజీకి సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో బాధతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు సరోజా. పార్టీలో నిబద్ధతతో పని చేసిన వారికి విలువ లేదని … పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని కొత్తవారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. జనసేన పార్టీలో మహిళలకు విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌లో పంతం నానాజీని ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు.

పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతున్న పవన్… ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇక పార్టీ నేత నాదేండ్ల మనోహర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సరోజా. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు అని ఆరోపించారు. త్వరలోనే రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.