- Advertisement -

విశాఖకు సీఎం జగన్

- Advertisement -

సీఎం జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే విజన్.. విశాఖ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం భవిత స్కిల్ డెవలప్ మెంట్, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్నారు జగన్.

ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు జగన్. అక్కడి నుండి మధురవాడ ఐటీ హిల్స్ కు వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. తర్వాత విజన్ – విశాఖ సదస్సు, భవిత స్కిల్ డెవలప్ మెంట్, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో జగన్ సమావేశం కానున్నారు జగన్.

విశాఖ పర్యటన సందర్భంగా రూ. 98 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రూ. 100 కోట్లతో ముడసర్లోవలో నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవనానికి జగన్ శంకుస్థాపన చేస్తారు. రూ. 10కోట్లతో టెర్టెల్ పార్క్ పనులకు శ్రీకారం చుడతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -