Monday, May 5, 2025
- Advertisement -

ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్

- Advertisement -
Kangana Ranaut Comments on Prabhas

మొదటి సినిమా ‘ఈశ్వర్’ లో పక్కా మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి ఆ తర్వాత సినిమాలు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ కి మంచి కాలం కలిసి వచ్చింది. ఆ చిత్రం తర్వాత మంచి హిట్స్ తో దూసుకెళ్ళాడు.

ఇక ‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అయ్యాడు.  ఇప్పుడు ప్రభాస్ అంటే తెలుగు లోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో. అలాంటి హీరోతో ఓ హీరోయిన్ గొడవ పెట్టుకుందట. అయితే అది ఇప్పుడు మాత్రం కాదు. గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కంగనా రౌనత్ షూటింగ్ సమయంలో చిన్న అభిప్రాయభేదాలు వచ్చాయట.

ఆ తర్వాత ఎలాగో అలా షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ ఇద్దరు తర్వాత ఎప్పుడూ కలుసుకున్నదే లేదట. ఇక ఏక్ నిరంజన్ సినిమా టైమ్ లో ఇద్దరికీ పెద్ద పేరు లేదు..కానీ ఇప్పుడు ఈ ఇద్దరు టాప్ హీరో, హీరోయిన్లు. ఓ సందర్భంలో కంగనా హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభాస్ ఏ విషయంలో గొడవ పెట్టుకున్న విషయం మాత్రం సీక్రెట్ గానే ఉంచింది. 

{youtube}7OS52_OOx9I{/youtube}

Related

  1. బాహుబలి కొత్త ఫోటో అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!
  2. ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరంటే..?
  3. న్యూడ్‍గా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్!
  4. అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -